Jagan: జగన్ పై హత్యాయత్నం కేసు విచారణలో సిట్ తేల్చిందిదే!

  • రేపటితో ముగియనున్న శ్రీనివాసరావు కస్టడీ
  • ఘటన వెనుక ఎటువంటి కుట్రా లేదు
  • సంచలనం కోసం శ్రీనివాస్ చేసిన పనే

గత వారంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడి కస్టడీ రేపటితో ముగియనుండటంతో సిట్ అధికారులు తమ రిపోర్టును సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన అవాంఛనీయమేనని, అయితే, దీని వెనుక వైకాపా ఆరోపిస్తున్నట్టు టీడీపీకి, టీడీపీ ఆరోపిస్తున్నట్టు వైకాపా నేతలకూ ఎలాంటి సంబంధం లేదని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

వైకాపా నేతలు సానుభూతి కోసం చేయించలేదని, ఇది సంచలనం కోసం శ్రీనివాస్ చేసిన పనేనని పేర్కొన్నట్టు సమాచారం. అదే కత్తి గొంతులో దిగివుంటే ప్రాణహాని జరిగివుండేదని చెబుతూ, నిందితుడి టార్గెట్ అది కాదని, అతని మానసిక స్థితి బాగాలేదని, ఒక్కోసారి సైకోలా ప్రవర్తిస్తున్నాడని తెలిపినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ కేసు వెనుక ఎలాంటి కుట్రా లేదని పేర్కొన్నట్టుగా సమాచారం. ఇదే రిపోర్టును సిట్ అందించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News