eaai lakshmi: 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ' గా రాయ్ లక్ష్మీ .. ఫస్టులుక్ రిలీజ్ డేట్ ఖరారు

  • గ్లామర్ తారగా రాయ్ లక్ష్మీ 
  • తన చుట్టూ తిరిగే కథతో సినిమా 
  • నితిన్ చేతుల మీదుగా ఫస్టులుక్

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో గ్లామర్ తారగా రాయ్ లక్ష్మికి మంచి క్రేజ్ వుంది. ఈ మధ్యనే ఆమె హిందీ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది .. అక్కడి వాళ్లంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక తెలుగు తెరపై చాలాకాలం క్రితమే మెరిసిన ఈ సుందరి, 'సర్దార్ గబ్బర్ సింగ్' .. 'ఖైదీ నెంబర్ 150' సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ తో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచుకుంది.అలాంటి రాయ్ లక్ష్మీ .. 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. యూత్ కు .. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమాను దర్శకుడు కిషోర్ కుమార్ తీర్చిదిద్దాడు. ఈ నెల 4వ తేదీన ఉదయం 11 గంటల 45 నిమిషాలకి హీరో నితిన్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. వెంకట లక్ష్మీగా రాయ్ లక్ష్మీ ఏ స్థాయిలో యూత్ మనసులు కొల్లగొడుతుందో చూడాలి.   

More Telugu News