Andhra Pradesh: రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. 50,000 టికెట్లు కేటాయించనున్న దేవస్థానం!

  • వచ్చే ఏడాది ఫిబ్రవవరిలో సేవలకు జారీ
  • ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ ప్రారంభం
  • వివరాలు వెల్లడించిన టీటీడీ

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రేపు విడుదల చేయనుంది. 2019, ఫిబ్రవరిలో స్వామివారి సేవల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ టికెట్లను రేపు ఉదయం 10 గంటల నుంచి www.tirumala.org వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్‌ విధానంలో జారీ చేయనున్నారు.

అలాగే విశేషపూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంటు బుకింగ్‌ కింద వెంటనే నమోదు చేసుకోవచ్చు. అన్ని రకాల సేవలను కలిపి దాదాపు 50,000 వరకూ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మరోవైపు భక్తుల నుంచి ఫిర్యాదులు, సూచనల సేకరణకు మొదటి శుక్రవారం(రేపు) టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య భక్తులు 0877- 2263261కు ఫోన్ చేసి ఈవోతో మాట్లాడవచ్చు.

More Telugu News