Tennis: నాలుగు నెలల వ్యవధిలోనే... అద్భుతం చేసిన జకోవిచ్!

  • జూన్ లో 22వ స్థానంలో జకోవిచ్
  • ప్రస్తుతం నంబర్ వన్ స్థానానికి
  • ఏడాదిగా అద్భుత ఆటతీరు చూపుతున్న జకో

టెన్నిస్ దిగ్గజం, సెర్బియా యూధుడు, నాలుగు నెలల వ్యవధిలో అద్భుతాన్ని చేసి చూపాడు. ఈ సంవత్సరం జూన్ లో 22వ స్థానంలో నిలిచి, తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందన్న సంకేతాలు ఇచ్చిన ఆయన, ప్రస్తుతం తిరిగి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. నిన్నటి వరకూ నంబర్ వన్ గా ఉన్న రఫెల్ నాదల్, గాయం కారణంగా పారిస్ మాస్టర్స్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో, ఆ స్థానాన్ని జకో చేజిక్కించుకున్నాడు.

గడచిన రెండు మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో టాప్-20 నుంచి తప్పుకున్న జకోవిచ్, ఈ సంవత్సరం అద్భుతంగా ఆడుతూ, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో మారత్ సఫిన్ తరువాత ఒకే సీజన్ లో టాప్-20లో లేకుండా, నంబర్ వన్ స్థానానికి వచ్చిన ఏకైక వ్యక్తి జకోవిచ్ కావడం గమనార్హం.

More Telugu News