Whatsapp: ఇక నుంచి వాట్సాప్‌లో ప్రకటనలు.. ఆదాయం రాబట్టేందుకు యత్నం

  • ఆదాయం రాబట్టేందుకు మార్క్ జుకర్ బర్గ్ యత్నం
  • స్టేటస్ సెక్షన్‌లో యాడ్స్ కనిపించబోతున్నాయి
  • ప్రకటనలు వాట్సాప్‌లో ఇంటర్ లింక్ అయి ఉంటాయి

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వాట్సాప్ నుంచి ఆదాయం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వాట్పాప్ వ్యవస్థాపకుడు  బ్రియన్ ఆక్టన్ గతంలో వెల్లడించారు. అయితే ఈ విషయం ఇప్పుడు నిజం కాబోతోంది. వాట్సాప్ యాప్‌లో స్టేటస్ సెక్షన్‌లో వినియోగదారులకు యాడ్స్ కనిపించబోతున్నాయి.

ఇప్పటి వరకూ ఉచితంగా సేవలు అందిస్తూ వచ్చిన వాట్సాప్‌ ఫర్‌ బిజినెస్‌ యాప్‌లో ఇక నుంచి ప్రకటనలకు ఫేస్‌బుక్‌ డబ్బు వసూలు చేయనున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు క్రిస్ డేనియల్స్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రకటనలతో ఫేస్‌బుక్ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోనుందని తెలిపారు. వ్యాపారులు నమోదు చేసుకున్న ప్రకటనలు వాట్సాప్‌లో ఇంటర్ లింక్ అయి ఉంటాయని తెలిపారు. అయితే ఈ వ్యాపారం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది మాత్రం వెల్లడించలేదు.

More Telugu News