jayaprada: భయపెట్టేస్తోన్న 'శరభ' .. ప్రధాన పాత్రలో జయప్రద

  • హారర్ థ్రిల్లర్ గా 'శరభ'
  • దర్శకుడిగా నరసింహారావు 
  • వచ్చేనెల 15వ తేదీన రిలీజ్  

తెలుగు తెరపై హారర్ థ్రిల్లర్ సినిమాలు తమ సత్తా చాటుకుంటూనే వున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఈ తరహా సినిమాలపై కాసుల వర్షం కురుస్తోంది. దాంతో హారర్ థ్రిల్లర్ చిత్రాల నిర్మాణం వైపు దర్శక నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. అలా జయప్రద ప్రధాన పాత్రగా 'శరభ' అనే ఒక హారర్ థ్రిల్లర్ రూపొందింది.

అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమాకి, ఎన్.నరసింహారావు దర్శకుడిగా వ్యవహరించాడు. నవంబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. పోస్టర్స్ మాత్రం భయాన్ని కలిగించేలా వున్నాయి. సక్సెస్ ను సాధించిన థ్రిల్లర్ సినిమాల జాబితాలో ఈ సినిమా చేరుతుందో లేదో చూడాలి.  

More Telugu News