paruchuri: 'అరవింద' ఎందుకు చూడాలని అడిగేవారికి నేను రెండు మాటలు చెబుతాను: పరుచూరి గోపాలకృష్ణ

  • ఎన్టీఆర్ నవరసాలను ఆవిష్కరించాడు 
  • జగపతిబాబు నటన ఆశ్చర్యాన్ని కలిగించింది
  • ఈ ఇద్దరి కోసం ఈ సినిమా చూడొచ్చు 

'తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో 'అరవింద సమేత' సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. "ఈ సినిమాలో ఎన్టీఆర్ నవరసాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఈ సినిమా ఎందుకు చూడాలని అడిగేవారికి .. ఎన్టీఆర్ కోసం చూడమని చెబుతాను. చాలామంది ఇదే మాటను చెబుతారనేది నా నమ్మకం .. ఎందుకంటే అంత గొప్పగా చేశాడు.

రెండోసారి ఈ సినిమా ఎందుకు చూడాలి? అని ఎవరైనా అడిగితే 'జగపతిబాబు కోసం' అని చెబుతాను. జగపతిబాబు హీరోగా నేను కొన్ని సినిమాలు రాశాను. కానీ ఈ రోజున ఆయన నటన చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఈయన ఎవరో లేని లోటును తీర్చబోతున్నాడు అనిపించింది. ఆ ఎవరనేది ఇప్పుడే చెప్పను .. సమయం వచ్చినప్పుడు చెబుతాను. బసిరెడ్డి .. ఆయన కొడుకు .. ఈశ్వరీ రావు పాత్ర కి మధ్య వచ్చే ఓ సన్నివేశంలో జగపతిబాబు నటన గురించి చెప్పుకోకుండా ఉండలేం. ఈయన అసలు మా జగపతిబాబేనా? అని నేను అలా చూస్తుండిపోయాను" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News