madhavan: బహుభాషా చిత్రంగా 'రాకెట్రీ' .. ఇస్రో మాజీ శాస్త్రవేత్తగా మాధవన్

  • పెరుగుతోన్న బయోపిక్ ల జోరు
  • బహుభాషల్లో మరో బయోపిక్
  • మాధవన్ కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర    

ఇప్పుడు ప్రతి భాషలోను కొత్తదనం కలిగిన చిత్రాలను .. నిజజీవితంతో ముడిపడిన కథలను రూపొందించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ తరహా సినిమాలు బహు భాషల్లో విడుదలవుతుండటం మరో విశేషం. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోన్న మరో బయోపిక్ 'రాకెట్రీ' .. ది నంబి ఎఫెక్ట్ అనేది ట్యాగ్ లైన్.

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఎంతో గొప్ప శాస్త్రవేత్త అనిపించుకున్న ఆయన ఒకానొక సమయంలో దేశద్రోహం కేసును ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తరువాత ఆయనపై ఆ కేసును కొట్టివేయడం జరిగింది. అలాంటి ఈ పాత్రలో మాధవన్ కనిపించనున్నాడు. తాజాగా ఈసినిమా నుంచి వదిలిన టీజర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ .. ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది.

More Telugu News