Tamilnadu: విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు.. 21 ఏళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు!

  • తమిళనాడులోని ధర్మపురిలో ఘటన
  • ప్రభుత్వ పాఠశాలలో బాలికపై దారుణం
  • జైలుశిక్షపై బాధిత కుటుంబం హర్షం

పిల్లలకు నీతి పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థినిని చెరపట్టాడు. చివరికి బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదుచేశారు. రెండేళ్ల పాటు దీన్ని విచారించిన న్యాయస్థానం సదరు ప్రబుద్ధుడికి ఏకంగా 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ధర్మపురి జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సెంథిల్ కుమార్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2016లో ఓ విద్యార్థినిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు సెంథిల్ కుమార్ ను రిమాండ్ కు తరలించారు.

అయితే ఈ కేసులో విచారణ చేపట్టిన జిల్లా మహిళా న్యాయస్థానం తాజాగా సెంథిల్ ను దోషిగా తేల్చింది. అతనికి 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సెంథిల్ కుమార్ కు జైలుశిక్ష విధించడంపై బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.

More Telugu News