raviteja: సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం

  • రవితేజ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ 
  • మరోసారి పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్
  • ఆర్మీ నేపథ్యంలో సూర్య సినిమా  

* రవితేజ కథానాయకుడిగా చేసిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో ఈ టీజర్ కి ఇంతవరకూ 40 లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. నవంబర్ 16వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

* ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. సి .కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. 80లలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోందని అంటున్నారు.

* ప్రస్తుతం సెల్వ రాఘవన్ .. కేవీ ఆనంద్ సినిమాలతో సూర్య  బిజీగా వున్నాడు. ఆ తరువాత ఆయన సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత మళ్లీ దర్శకుడు హరితో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇది ఆర్మీ నేపథ్యంలో రూపొందుతుందట.

More Telugu News