Samsung: భారత్‌లో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్‌గా తొలి రెండు స్థానాల్లో నిలిచిన శామ్‌సంగ్

  • దాదాపు 6,780 మంది అభిప్రాయాల సేకరణ
  • బ్రాండ్ ఏషియా సర్వే 2018 పేరిట నివేదిక
  • మూడు, నాలుగు స్థానాల్లో వాట్సాప్, అమూల్

భారత్‌లో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ కోసం దాదాపు 6,780 మంది అభిప్రాయాలను తీసుకుని సర్వే నిర్వహిస్తే తొలి రెండు స్థానాల్లోనూ దక్షిణకొరియా సంస్థ శామ్‌సంగే నిలవడం విశేషం. దీనికి సంబంధించిన నివేదికను బ్రాండ్ ఏషియా సర్వే 2018 పేరిట మంగళవారం విడుదల చేసింది.

ఈ సర్వేలో మొదటి స్థానంలో శామ్‌సంగ్ మొబైల్‌ బ్రాండ్‌ నిలవగా.. ఎలక్ట్రానిక్, ఐటీ బ్రాండ్ శామ్‌సంగ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో వాట్సాప్, నాలుగోస్థానంలో అమూల్, ఐదో స్థానంలో పెప్సీ, ఆరో స్థానంలో ఫేస్‌బుక్, ఏడో స్థానంలో కోకోకోలా, ఎనిమిదో స్థానంలో జియో, తొమ్మిదో స్థానంలో బిగ్ బజార్, పదో స్థానంలో కోల్గేట్ నిలిచాయి.

More Telugu News