Telangana election commission: తెలంగాణ ఎన్నికల సంఘం నోటీసులపై స్పందించిన ఏపీ డీజీపీ

  • ఇంటెలిజెన్స్ అధికారులు ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చు
  • ఆ నోటీసుల్లో పేర్కొన్న వాళ్లందరూ మా వాళ్లే
  • మావోయిస్టుల సమాచారం కోసమే తెలంగాణకు వెళ్లారు

ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణలో నగదు పంచుతున్నారన్న ఆరోపణలు ఇటీవల కలకలం రేపాయి. ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ఏపీ డీజీపీకి టీఎస్ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ఠాకూర్ స్పందించారు. నిఘాలో భాగంగా ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు ఇంటెలిజెన్స్ అధికారులకు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వెంకటేశ్వరరావుతో చర్చించారు. అనంతరం తెలంగాణ ఎన్నికల సంఘానికి సమాధానం పంపారు. ఆ నోటీసుల్లో పేర్కొన్న విధంగా వారంతా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులేనని, వారి వద్ద నగదు ఉందన్న మాట అవాస్తవమని కొట్టిపారేశారు. ఎన్నికల సంఘం పంపిన వీడియోలో కూడా వారి వద్ద నగదు ఉన్నట్టు లేదని అన్నారు. మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారం కోసమే ఆ అధికారులు తెలంగాణకు వెళ్లారని, ఏపీ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇంకా తెలంగాణలో ఉందని అన్నారు.

More Telugu News