SBI: ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి రోజుకు గరిష్టంగా రూ.20 వేలు విత్‌డ్రా..రేపటి నుంచే అమలు

  • రోజుకు గరిష్టంగా రూ.20 వేలు విత్‌డ్రాకు అవకాశం
  • అక్టోబర్ 31 అర్థరాత్రి నుంచి అమలు
  • 1.42 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం

ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలపై ఫిర్యాదులు పెరుగుతుండడంతోపాటు నగదు రహిత, డిజిటల్ లావాదేవీలు పెంచడమే లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తీసుకున్న మరో కీలకమైన నిర్ణయం అమల్లోకి రానుంది. ఎస్‌బీఐ వినియోగదారులు ఇకపై రోజుకు గరిష్టంగా రూ. 20 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ప్రకటించిన ఈ కొత్త పరిమితి నిబంధన రేపు అనగా అక్టోబర్ 31 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది.

అయితే రూ. 20 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకునేవారు హై వెరియంట్‌ డెబిట్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు అధికారులు సూచించారు. ఈ నిబంధన కారణంగా దాదాపు 1.42 కోట్ల మంది ఎస్‌బీఐ వినియోగదారులపై ఈ ప్రభావం పడనుంది.

అత్యధికమంది రోజుకు రూ.20 వేలకు మించి తీయడం లేదని, అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం కొందరు వ్యాపారులు మాత్రం రూ. 40 వేల వరకూ ఏటీఎంలలో విత్‌డ్రా చేస్తున్నారని తమ పరిశీలనలో  తేలిందని అధికారులు తెలిపారు. ఎస్‌బీఐ క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్న వినియోగదారులు ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసే పరిమితి రూ. 40 వేల నగదును సగానికి కోత పెట్టి కేవలం రూ.20 వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

SBI

More Telugu News