polavaram: ‘పోలవరం’ నిర్మాణ పనులు చూస్తే మేం పడుతున్న శ్రమ తెలుస్తుంది: సీఎం చంద్రబాబు

  • ‘పోలవరం’ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి
  • కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు
  • 2019 మే లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం

‘పోలవరం’ ప్రాజెక్టు నిర్మాణ పనులు చూస్తే తాము పడుతున్న శ్రమేంటో తెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో జరుగుతున్న ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి రాయలసీమకు నీరు అందిస్తున్నామని, రూ.670 కోట్లు ఖర్చు చేసి గండికోట ప్రాజెక్ట్ కు 12 టీఎంసీలు తరలించామని చెప్పారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా..ఈ నదులను అనుసంధానం చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని, ‘కరవు’ అనేది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

2019 మే నెల లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తామని, ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ ప్రాజెక్టు నిర్మాణం మాత్రం ఆగదని ఘంటాపథంగా చెప్పారు. రెండు నెలల్లోగా ఫేజ్-1 కింద ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఆర్ అండ్ ఆర్ కానీ పూర్తి చేస్తామని, మే లోగా గ్రావిటీతో నీళ్లిచ్చి, రాబోయే డిసెంబర్ లోగా అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పారు. దేశంలో శరవేగంగా ఏదైనా జాతీయ ప్రాజెక్టు పూర్తయిందంటే అది ‘పోలవరం’ అవుతుందని, ఆ ఘనత దక్కించుకుంటుందని, అందుకు జాతి గర్వపడుతుందని చంద్రబాబు అన్నారు.

More Telugu News