ntr: 100 కోట్ల షేర్ సాధించిన 'అరవింద' .. ఎన్టీఆర్ కెరియర్లో ఫస్టు టైమ్

  • ఈ నెల 11న వచ్చిన 'అరవింద'
  • వసూళ్ల పరంగా తగ్గని దూకుడు
  • 18 రోజుల్లో 165 కోట్ల గ్రాస్

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం తెరకెక్కింది. ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఓపెనింగ్స్ విషయంలోనే రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఇంకా తన దూకుడు చూపుతూనే వుంది.18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 165 కోట్ల గ్రాస్ ను సాధించి .. 100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసింది. ఎన్టీఆర్ కెరియర్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే. ఇలా ఒక అరుదైన రికార్డును ఎన్టీఆర్ ఖాతాలో ఈ సినిమా నమోదు చేసి పెట్టింది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అంటూ వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని అభిమానులు భావించారు. అది నిజమైనందుకు వాళ్లంతా కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.   

More Telugu News