vijay: తెలుగులో అత్యధిక థియేటర్లలో 'సర్కార్'

  • దీపావళికి 'సర్కార్' విడుదల 
  • తమిళనాడులో 700లోపు థియేటర్స్ 
  • తెలుగులో 750 థియేటర్స్ లో రిలీజ్  

తమిళనాడులో దీపావళి ఈ సారి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ రోజున 'సర్కార్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విజయ్ హీరోగా .. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించారు. ఈ ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ ఉండటంతో, ఈ సినిమాను తమిళంలోనే కాకుండా తెలుగులోను విడుదల చేయనున్నారు.

ఆ మాట కొస్తే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ .. అందువలన అక్కడ 600 నుంచి 700 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 750 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల 'నవాబ్' సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన వల్లభనేని అశోక్, 'సర్కార్' ను ఇంతటి భారీస్థాయిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. 

More Telugu News