Supreme Court: సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు!

  • నలుగురి పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం
  • అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ చేయాలని సూచన
  • నిర్ణయం తీసుకోనున్న కేంద్ర మంత్రి మండలి

సుప్రీంకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం రిపోర్టును పంపించింది. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుభాష్ రెడ్డి, మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న హేమంత్ గుప్తాలను కొలీజియం సిఫార్సు చేసింది. వీరితో పాటు త్రిపుర హైకోర్టు సీజే అజయ్ రస్తోగి, బీహార్ హైకోర్టు సీజే షాలను అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ చేయాలని సూచించింది. కాగా, కొలీజియం సిఫార్సులపై కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవాల్సివుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన త్వరలో సమావేశం కానున్న కేబినెట్ కొత్త న్యాయమూర్తుల నియామకంపై చర్చించనుంది.

More Telugu News