KTR: 'ఆ గట్టునుంటావా? నాగన్న ఈ గట్టు కొస్తావా?': కేటీఆర్ నోట 'రంగస్థలం' పాట!

  • అచ్చంపేటలో టీఆర్ఎస్ బహిరంగ సభ
  • ఓటేసే ముందు ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలి
  • కాంగ్రెస్ వస్తే తెలంగాణ వెనుకబడిపోతుందన్న కేటీఆర్

అచ్చంపేటలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వేళ, యువనేత కేటీఆర్ నోటి వెంట ఇటీవలి సూపర్ హిట్ చిత్రం 'రంగస్థలం'లోని 'ఆ గట్టునుంటావా? నాగన్న ఈ గట్టు కొస్తావా?' పాట వినిపించింది. "ఇటీవల నేను ఓ సినిమాను చూశాను. అందులోని ఓ పాట లిరిక్స్ ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతాయి. అదే 'ఆ గట్టునుంటావా? నాగన్న ఈ గట్టు కొస్తావా?' ఓటేసేముందు ఎవరు అధికారంలోకి రావాలన్న విషయమై, ప్రజలే మంచి నిర్ణయం తీసుకోవాలి" అని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసి, ఆ పార్టీ అధికారంలోకి వస్తే, తిరిగి విద్యుత్ కోతలు మొదలవుతాయి. రైతులకు ఆరు గంటలు మాత్రమే విద్యుత్ అందుతుంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోతుంది. దశాబ్దాల నాటి పరిస్థితులు మళ్లీ వస్తాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలబడాలని అన్నారు.

More Telugu News