Balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ లో కృష్ణ పాత్ర?

  • షూటింగ్ దశలో ఎన్టీఆర్ బయోపిక్
  • ఆసక్తిచూపని మహేశ్ బాబు
  • కృష్ణ పాత్రపై సందేహాలు

ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా రూపొందుతోంది. ప్రస్తుతం 'కథానాయకుడు' కి సంబంధించిన షూటింగ్ చకచకా జరుగుతోంది. ఈ సినిమాలో ఏఎన్నార్ గా సుమంత్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కృష్ణగారిలా ఎవరు నటించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఎన్టీఆర్ తో కృష్ణకి మంచి సాన్నిహిత్యం వుంది. భారీ బడ్జెట్ తో కృష్ణ నిర్మించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలో ఎన్టీఆర్ నటించగా .. అది ఘన విజయాన్ని అందుకుంది. అందువలన కృష్ణ పాత్రను కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించాలనుకున్నారు. కృష్ణ పాత్ర కోసం మహేశ్ బాబును సంప్రదించారు కూడా. గెస్టు పాత్రలు వేయడం మహేశ్ కి మొదటి నుంచి కూడా అలవాటు లేదు. అందువలన ఆయన ఆసక్తిని చూపలేదు. ఈ నేపథ్యంలో కృష్ణ పాత్ర లేకుండానే సినిమాను కానిచ్చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. కృష్ణగా మరో ఆర్టిస్ట్ ను పెట్టి ఒకటి .. రెండు షాట్స్ ను తీశారనేది మరికొంతమంది మాట.  

More Telugu News