Sonal: సహోద్యోగిపై కన్ను... అమెరికా వెళ్లినా వదలని ప్రబుద్ధుడు!

  • 2015లో పై అధికారిగా యువతితో పరిచయం
  • ఆమెకు ముంబైలో ఉద్యోగం ఇప్పించిన సోనాల్
  • పెళ్లి తరువాత అమెరికా వెళ్లిపోయిన యువతి
  • మార్ఫింగ్ ఫొటోలతో వేధిస్తుండగా అరెస్ట్

కలసి పనిచేస్తున్న సమయంలో సహోద్యోగినితో సన్నిహితంగా ఉన్న ఓ ప్రబుద్ధుడు, ఆపై తన చెడు ప్రవర్తనతో ఉద్యోగం ఊడగొట్టుకుని, ఆమెను వేధించి పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, లక్నోలో ఎంబీజే చదివిన సోనాల్ నారాయణ్ చౌహాన్ (39), 2015లో హైదరాబాద్ లో ఓ కంపెనీలో పని చేస్తున్న వేళ, ఓ యువతితో చనువుగా ఉండేవాడు. ఆమెకు పై అధికారిగా ఉన్న సోనాల్, తరువాత ముంబైకి మకాం మార్చి అక్కడ ఇంకో కంపెనీలో చేరి, ఆమెకు కూడా ఉద్యోగం ఇప్పించాడు. ఈ చనువుతో, ఆమె తరచూ అతని ఇంటికి కూడా వచ్చి వెళుతుండేది. ఆమె ఐ ప్యాడ్ లోని సమాచారం మొత్తాన్నీ సోనాల్ సేకరించాడు.

2016లో అతనిపై ఫిర్యాదులు రాగా, ఉద్యోగం నుంచి సోనాల్ ను తొలగించాడు. ఆమె వల్లే తన ఉద్యోగం పోయిందని పగను పెంచుకున్నాడు. 2017లో ఆ యువతికి వివాహమై, అమెరికా వెళ్లిపోగా, వేధింపులు ప్రారంభించాడు. తనతో దిగిన ఫొటోలు, చాటింగ్, మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఆమె భర్త, కుటుంబీకులు, బంధువులకు పంపించడంతో పాటు, ఫోన్ చేసి తన వద్దకు రావాలంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె రాచకొండ పోలీసులను ఆశ్రయించగా, విచారించిన పోలీసులు, నిందితుడిని ముంబైలో అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News