Anushka: అనుష్క 'ఆకు మెట్టెల' ఫొటో వెనకున్న అసలు విషయమిది!

  • రెండు రోజుల క్రితం ఫొటో పోస్టు చేసిన అనుష్క
  • ఆమె పెళ్లి ఖరారైందంటూ నెటిజన్ల కామెంట్లు
  • అటువంటిదేమీ లేదని వివరణ

రెండు రోజుల క్రితం అనుష్క సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్ కాగా, ఆమె వివాహానికి సిద్ధమైందంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై అనుష్క స్పందించింది. తన కాలి బొటనవేలు, చూపుడు వేలు మధ్య మెట్టెల మాదిరిగా, ఆకులతో కూడిన తీగను చుట్టుకుని ఆమె ఓ ఫొటో తీసి పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, తాను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోకు, పెళ్లికి సంబంధం లేదని అనుష్క చెబుతోంది. ప్రస్తుతం బరువు తగ్గేందుకు నార్వేలోని ఓ ప్రకృతి వైద్య శాలలో అనుష్క చేరింది. దట్టమైన అడవుల్లో ఈ వైద్య శాల ఉంది. అక్కడామె బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తోంది. రిసార్టులానే ఉండే ఈ హెల్త్ సెంటర్ లో నాచురోపతీ పద్ధతిలో చికిత్స ఉంటుందట. ఖాళీ సమయాల్లో ఆ అడవుల్లో తిరుగుతూ, ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోయి, తన కాలికి తగిలిన తీగను ఫొటోతీసి పోస్టు చేసిందట. అదీ అసలు సంగతి.

More Telugu News