Chandrababu: పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు మరో వరం.. గిరిజనేతర కుటుంబాలకు అదనంగా రూ.50 వేలు

  • గిరిజనేతర కుటుంబాలకు అదనంగా రూ.50 వేలు
  • మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేలు
  • ప్రభుత్వంపై రూ. 245.53 కోట్ల భారం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ముంపు ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్లకు అదనంగా రూ.75 వేలు ఇస్తున్నారు. ఇప్పుడు గిరిజనేతర కుటుంబాలకు కూడా అదనంగా రూ.50 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం సీఎం మాట్లాడారు.

తాజా నిర్ణయం వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.245.53 కోట్ల వరకు భారం పడుతుందన్నారు. అలాగే, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం కోసం రూ.15 వేలు అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్మించే గృహ విస్తీర్ణం కంటే మరింత విశాలంగా నిర్మించుకోవాలనుకున్నా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అవసరం అనుకుంటే బ్యాంకుల నుంచి కూడా రుణాలు పొందేందుకు సహకరిస్తామన్నారు. నిర్వాసితుల కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.  

More Telugu News