Titli cyclone: అమరావతి రైతుల దొడ్డ మనసు.. తిత్లీ తుపాను బాధితులకు రూ.80 లక్షల విలువైన వస్త్రాలు, గృహోపకరణాల విరాళం

  • బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన తుళ్లూరు మండల ప్రజలు
  • రూ.80 లక్షల విలువైన సామగ్రి పంపిణీ
  • తుళ్లూరు ప్రజలు ఆదర్శ ప్రాయులన్న చంద్రబాబు

తిత్లీ తుపాను బాధితులకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రజలు భారీ సాయం అందిస్తున్నారు. తుళ్లూరులోని 16 గ్రామాల ప్రజలు బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. దాదాపు 80 లక్షల విలువైన వస్త్రాలు, గృహోపకరణాలను శ్రీకాకుళం పంపించారు. రెండు లారీల్లో తరలించిన వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన తుళ్లూరు మండల ప్రజలు ఆదర్శప్రాయులని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొనియాడారు.

ఇటీవల శ్రీకాకుళంలో సంభవించిన తిత్లీ తుపాను జిల్లాను చిగురుటాకులా వణికించింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. కొన్ని రోజులపాటు అంధకారంలో మునిగిపోయిన గ్రామాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుకుంటున్నాయి. వేల కోట్ల నష్టం వాటిల్లింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబునాయుడు కేంద్రాన్ని అర్థించినప్పటికీ మోదీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే,  ప్రజలు, పలువురు ప్రముఖులు మాత్రం ముందుకొచ్చి బాధితులకు సాయం అందించారు.

More Telugu News