Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కోరుకునే పాత్రలే వస్తున్నాయట!
  • 'మహర్షి' న్యూయార్క్ షెడ్యూల్ అప్ డేట్ 
  • యథార్థ సంఘటనతో 'పలాస 1978'

*  నేను కోరుకునే పాత్రలే ప్రస్తుతం నాకు వస్తున్నాయి.. అంటోంది అందాలతార పూజా హెగ్డే. 'కెరీర్ ప్రారంభంలో ఎలాంటి పాత్రలైతే రావాలని కోరుకుంటామో అలాంటి పాత్రలే నాకు వస్తున్నాయి. అందుకే నేను అదృష్టవంతురాలినని అంటాను. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాను' అని చెప్పింది.
*  మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. రేపటితో ఈ షెడ్యూల్ పూర్తవుతుందని, నవంబర్ మొదటి వారంలో యూనిట్ హైదరాబాదుకి చేరుకుంటుందని సమాచారం.
*  ఓ యథార్థ సంఘటన ఆధారంగా 'పలాస 1978' చిత్రం రూపొందనుంది. నూతన దర్శకుడు కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

More Telugu News