ఆ వ్యంగ్యార్థాల పోస్టర్‌తో నాకెలాంటి సంబంధమూ లేదు: హీరో శ్రీవిష్ణు

29-10-2018 Mon 21:39
  • మల్టీస్టారర్ చిత్రాలలో ‘వీరభోగ వసంత రాయలు’ ఒకటి
  • ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం చాలా నిరాశను మిగిల్చింది
  • చిత్ర సమీక్షకులను టార్గెట్ చేస్తూ ఓ పోస్టర్‌ విడుదల
ఇటీవల తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రాలలో ‘వీరభోగ వసంత రాయలు’ ఒకటి. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రీయ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంపై ఆది నుంచి మంచి అంచనాలున్నాయి. కానీ విడుదలయ్యాక మాత్రం చిత్రబృందానికి చిత్ర సమీక్షలు ఊహించని షాక్ ఇచ్చాయి. ‘వీరభోగ వసంత రాయలు’లో నటించిన ప్రతి ఒక్కరికీ చిత్రం చాలా నిరాశను మిగిల్చింది.

దీంతో కలత చెందిన చిత్ర బృందం చిత్ర సమీక్షకులను టార్గెట్ చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో చాలా వ్యంగ్యార్థాలుండటం విశేషం. తాజాగా ఈ పోస్టర్‌పై స్పందించిన హీరో శ్రీవిష్ణు ‘‘సోషల్ మీడియాలో షికారు చేస్తున్న వ్యంగ్యార్థాల పోస్టర్‌పై నాకెలాంటి సంబంధం లేదు. చిత్ర సమీక్షకులను నేనెప్పుడూ గౌరవిస్తాను. వారికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.