srikanth: 'తెలంగాణ దేవుడు'లో కేసీఆర్ గా శ్రీకాంత్?

  • కేసీఆర్ జీవితచరిత్రగా 'తెలంగాణ దేవుడు'
  • శ్రీకాంత్ కి ఉత్తేజ్ సహకారం 
  • ముగింపు దశలో చిత్రీకరణ

తెలుగులో ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ .. మరో వైపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ నిర్మితమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కూడా 'తెలంగాణ దేవుడు' అనే పేరుతొ రూపొందుతోంది. ఈ బయోపిక్ లో తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ పాత్రలో తాను కనిపించనున్నట్టు శ్రీకాంత్ చెప్పారు.

కేసీఆర్ బాల్యం .. విద్యాభ్యాసం .. రాజకీయనాయకుడిగా ఆయన ఎదుగుదల .. తెలంగాణ ఉద్యమం .. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవరకూ ఈ సినిమా కొనసాగుతుందని శ్రీకాంత్ అన్నారు. ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో తాను కనిపిస్తున్నప్పటికీ ఆయన పేరును మాత్రం వాడుకోవడం లేదనీ .. తనపాత్ర పేరు విజయ్ దేవ్ అని చెప్పారు.

ఇక తనకి ఎంతో ఇష్టమైన కేసీఆర్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పే విషయంలో నటుడు ఉత్తేజ్ తనకి ఎంతో సహకరిస్తున్నాడనీ, మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగు పూర్తవుతుందని చెప్పుకొచ్చారు.     

More Telugu News