sensex: నష్టాల నుంచి భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు

  • 718 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 221 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 18 శాతం పైగా లాభపడ్డ అదానీ పవర్

దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. కొనుగోళ్ల అండతో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం 170 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ను ప్రారంభించిన సెన్సెక్స్... ఆరంభంలో కాస్త తడబడినా... ఆ తర్వాత ఆటోమొబైల్, మెటల్స్, బ్యాంకింగ్ రంగాల మద్దతుతో దూసుకుపోయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్  ఏకంగా 718 పాయింట్లు లాభపడి 34,067కు ఎగబాకింది. నిఫ్టీ 221 పాయింట్లు పుంజుకుని 10,251కు చేరుకుంది.

టాప్ గెయినర్స్:
అదానీ పవర్ (18.73%), దివీస్ ల్యాబ్ (14.91%), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (13.05%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (12.72%), ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (12.46%).  

టాప్ లూజర్స్:
వక్రాంగీ (-5.00%), ఇండియన్ ఎనర్జీ ఎక్స్ ఛేంజ్ లిమిటెడ్ (-3.31%), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (-3.00%), ఈక్విటాస్ హోల్డింగ్స్ (-2.78%), హెక్సావేర్ టెక్నాలజీస్ (-2.63%).     

More Telugu News