balakrishna: పెళ్లి సన్నివేశాల చిత్రీకరణలో 'ఎన్టీఆర్' బయోపిక్

  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • తదుపరి షెడ్యూల్ అవుట్ డోర్లో 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  

ఎన్టీఆర్ బయోపిక్ లో తొలిభాగమైన 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాలను చకచకా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీ రామారావు శ్రీమతి బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నారు. కొన్ని రోజులక్రితం బాలకృష్ణ .. విద్యాబాలన్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మళ్లీ ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ - బసవతారకం పాత్రలో విద్యాబాలన్ పాల్గొనగా పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

 అప్పట్లో పెళ్లిళ్లు ఎలా జరిగేవి .. ఆ పెళ్లిళ్లలో ఎలాంటి వస్తువులు ఉపయోగించేవారు .. అప్పటి వస్త్రధారణ ఎలా ఉండేది .. ఇలా అన్ని విషయాలను పరిశీలించి మరీ పెళ్లి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు పెళ్లి దృశ్యాలనే చిత్రీకరించనున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను అవుట్ డోర్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.  సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.      

More Telugu News