ayodhya: అయోధ్య కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

  • అలహాబాద్ తీర్పును సవాల్ చేస్తే పలు పిటిషన్లు దాఖలు
  • పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం
  • సార్వత్రిక ఎన్నికలకు ముందు విచారణ అనవసరమన్న గొగోయ్

అయోధ్య రామ మందిరం- బాబ్రీ మసీదు కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. విచారణ తేదీలను, ధర్మాసనం వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించింది. ఆ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులు మూడు రకాలైన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటిషన్లను ఈరోజు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా గొగోయ్ మాట్లాడుతూ, వాస్తవానికి జనవరిలో కూడా ఈ పిటిషన్లపై విచారించాల్సిన అవసరం లేదని... సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీనిపై విచారణ అనవసరమని చెప్పారు. తరుపరి విచారణను జనవరికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి... నాలుగు నిమిషాల్లో విచారణను ముగించారు. 

More Telugu News