surya: సూర్య అభిమానుల్లో పెరుగుతోన్న అసహనం

  • సూర్య 36వ సినిమాగా 'ఎన్జీకే'
  • ముగింపు దశలో షూటింగ్ 
  • దీపావళి కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

తెలుగు .. తమిళ భాషల్లో సూర్యకి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' చిత్రం నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. వచ్చేనెలలో జరిగే షెడ్యూల్ తో షూటింగు పూర్తికానుంది. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

తన 36వ సినిమాగా సూర్య చేస్తోన్న ఈ చిత్రంలో కథానాయికలుగా రకుల్ .. సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగు మొదలైన దగ్గర నుంచి టైటిల్ పోస్టర్ తప్ప ఇంతవరకూ ఎలాంటి అప్డేట్ అభిమానుల ముందుకు రాలేదు. దాంతో సూర్య అభిమానులంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీపావళికి ఈ సినిమా నుంచి టీజర్ వదిలితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ముచ్చటను సూర్య తీరుస్తాడేమో చూడాలి మరి.   

More Telugu News