Arjun Rampal: కేన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన నటుడు అర్జున్ రాంపాల్ తల్లి

  • బ్రెస్ట్ కేన్సర్‌తో పోరాడుతున్న రాంపాల్ తల్లి
  • ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు
  • తరలివచ్చిన బాలీవుడ్

బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ తల్లి గ్వెన్ రాంపాల్ మృతి చెందారు. గత కొన్నేళ్లుగా కేన్సర్‌తో పోరాడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతి వార్తతో బాలీవుడ్ ను శోక సంద్రంలో మునిగిపోయింది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన అంత్యక్రియలకు బాలీవుడ్ మొత్తం తరలివచ్చింది.  

కొన్ని నెలల క్రితం అర్జున్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేస్తూ.. తన తల్లి రొమ్ము కేన్సర్‌తో పోరాడుతున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం కేన్సర్ ఓ అంటువ్యాధిలా తయారైందని అందులో వాపోయాడు. ప్రస్తుతం తన తల్లి కేన్సర్‌కు చికిత్స తీసుకుంటోందని, త్వరలోనే నయమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, పది నెలల తర్వాత ఆ కేన్సర్ ఊపిరితిత్తులకు కూడా పాకిందని పేర్కొన్నాడు. స్నేహితుడి సాయంతో లిస్బన్‌లోని చంపాలి మౌద్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్‌కు వెళ్లినట్టు పేర్కొన్నాడు. 

More Telugu News