Pratibha Bharathi: ప్రతిభా భారతి ఆరోగ్యం విషమం.. చికిత్సకు సహకరించని శరీరం!

  • 60 వేలకు పడిపోయిన ప్లేట్‌లెట్లు
  • రక్తం ఎక్కిస్తుంటే ఇన్ఫెక్షన్లు
  • హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయం

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆరోగ్యం మరింత విషమించింది. చికిత్సకు ఆమె శరీరం స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించారు. ఆమె శరీరంలో ప్లేట్‌లెట్లు పడిపోయాయని, రక్తం ఎక్కిస్తుంటే ఇన్ఫెక్షన్లు వస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

గుండెపోటుతో ఇటీవల విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో చేరిన ఆమె రక్తంలోని ప్లేట్‌లెట్లు ఆదివారం రాత్రికి 60 వేలకు పడిపోయాయి. హిమోగ్లోబిన్ శాతం కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఆమెకు రక్తం ఎక్కించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇన్ఫెక్షన్లు తలెత్తుతుండడంతో వైద్యులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ పున్నయ్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతిని మంత్రి కళావెంకట్రావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తదితరులు పరామర్శించారు.  

More Telugu News