Inonasia: ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం.. సముద్రంలో కూలిన ఫ్లైట్.. 188 మంది మృతి?

  • టేకాఫ్ అయిన కాసేపటికే ఏటీసీతో తెగిన సంబంధాలు
  • సముద్రంలో కూలినట్టు గుర్తింపు
  • గాలింపు చర్యలు ముమ్మరం

188 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఇండోనేషియాకు చెందిన లయన్ ఎయిర్ బోయింగ్ 737 విమానం సముద్రంలో కూలిపోయింది. రాజధాని జకార్తా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఏసీటీతో సంబంధాలు తెగిపోయాయి. జకార్తా నుంచి బయలుదేరిన ఈ విమానం బాంకా బెలిటంగ్ ద్వీపంలోని పంకాల్ పినాంగ్ వెళ్లాల్సి ఉంది.

విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకు సముద్రం మీది నుంచి ప్రయాణిస్తుండగా ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం విమానం సముద్రంలో కూలిపోయినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రయాణికుల్లో ఎవరైనా బతికి బయటపడ్డారా? అనే విషయం తెలియరాలేదు. ప్రయాణికుల్లో 178 మంది పెద్దలు, ఓ చిన్నారి, ఇద్దరు బేబీలు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News