amit shah: అమిత్ షా కాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి.. అందుకే అలా కూర్చుంటారు!: స్వామి పరిపూర్ణానంద

  • అమిత్ షా నా పట్ల ఎంతో విధేయతతో వ్యవహరించారు
  • ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత.. ఆయనే స్వయంగా పళ్లు, ఫలాహారాలు తీసుకొచ్చారు
  • ఒక పండును నా చేతులతో ఇవ్వాలని కోరారు

కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో స్వామి పరిపూర్ణానంద ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పీఠాధిపతి అయిన పరిపూర్ణానంద ముందు అమిత్ షా కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం చాలా మందికి నచ్చలేదు. ఇదే విషయంపై ఓ మీడియా సంస్థ ఆయనను ప్రశ్నించగా... ఆయన ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు.

తనను చూడగానే అమిత్ షా వంగి నమస్కరించారని పరిపూర్ణానంద తెలిపారు. తన మెడలో బీజేపీ కండువా వేసిన తర్వాత... తనకు కూడా కండువా వేయాలని ఎంతో వినయంతో అమిత్ షా తనను అడిగారని చెప్పారు. అమిత్ షా తన పట్ల ఎంతో విధేయతతో వ్యవహరించారని తెలిపారు. ఆయన కాళ్లకు ఇబ్బందులు ఉన్నాయని... దీంతో, ఆయన సరిగా కూర్చోలేరని చెప్పారు. తనను అడిగే కాలుపై కాలు వేసుకున్నారని తెలిపారు. తాను ఉన్నవైపు కాకుండా మరోవైపు కాలు వేసుకున్నారని చెప్పారు. తనను ఆయన స్వాగతించిన తీరు చాలా గొప్పదని అన్నారు.

ఆ తర్వాత తాను మళ్లీ విజయదశమి రోజున ఢిల్లీకి వెళ్లానని... పార్టీ కార్యాలయానికి కాకుండా తమ ఇంటికి రావాలని అమిత్ షా తనను కోరారని పరిపూర్ణానంద తెలిపారు. మా ఇంట్లో అడుగుపెట్టాలని... మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటానని చెప్పారని అన్నారు. ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పళ్లు, ఫలహారాలు ఆయనే స్వయంగా తీసుకొచ్చారని... తన చేతుల మీదుగా ఒక పండు ఇవ్వాలని కోరారని తెలిపారు. ఆయన తనను అడిగి కూర్చున్న తర్వాత... ఇలాంటి సందర్భం తనకు వచ్చినా... ఎదుటి వారిని అడిగే కూర్చోవాలని తనకు అనిపించిందని చెప్పారు. 

More Telugu News