Vijay Devarakonda: త్రివిక్రమ్, విజయ్ దేవరకొండల కలయికలో సినిమా అలా తప్పిపోయిందట!

  • సినిమా తెరకెక్కించాలనుకున్న నందినీరెడ్డి
  • కథతో త్రివిక్రమ్‌ని కలిసిన నందిని 
  • విజయ్ అయితే బాగుంటుందని సూచన

విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ ఉన్న హీరో.. త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే దానిపై అంచనాలకు రెక్కలొస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ కలయికలో సినిమా కొద్దిలో తప్పిపోయిందట. దర్శకురాలు నందినీరెడ్డి ఓ కథను సిద్ధం చేసుకుని ఆ కథను త్రివిక్రమ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కించాలని భావించారట.

ఈ క్రమంలో వెంటనే ఆమె త్రివిక్రమ్‌ను కలిశారట. విజయ్‌తో ఈ సినిమా చేస్తే మంచి విజయం సాధిస్తుందని ఆయనకు సూచించారట. ఆ కథను క్షుణ్ణంగా పరిశీలించిన త్రివిక్రమ్ ఒక్క హీరో అయితే సరిపోడని.. మరికొందరు హీరోలు అవసరమని తేల్చి చెప్పారట. దీంతో వారిద్దరి కాంబినేషన్ మిస్ అయింది. అయితే ఆ కథతో ప్రస్తుతం స్వప్నాదత్ వెబ్ సిరీస్ తీయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు లక్ష్మీ భూపాల మాటలు రాస్తున్నారు. ఆయనే త్రివిక్రమ్, విజయ్ కలయికలో సినిమా తప్పిపోయిన విషయాన్ని వెల్లడించారు.

More Telugu News