what`sup: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త ఫీచర్లు!

  • వాట్సాప్ లో ఉండే సైట్ల వీడియోలు చూడొచ్చు
  • హోల్డ్ చేయకుండానే రిప్లై ఇవ్వొచ్చు
  • ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి ఫీచర్లు

‘ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్’ వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ కు వచ్చిన యూట్యాబ్, ఫేస్ బుక్, తదితర సైట్ల లింక్ ల ద్వారా వీడియోలు చూసేందుకు ఇకపై వాట్సాప్ ను వదిలిపెట్టాల్సిన పనిలేదు. వాట్సాప్ లో చాటింగ్ చేస్తూనే మరో విండోలో తమకు వచ్చిన వీడియోలను ‘పిక్చర్ ఇన్ పిక్చర్’ తరహాలో చూడవచ్చు.  

రెండో ఫీచర్.. ఇప్పటివరకూ వాట్సాప్ లో ఏ మెసేజ్ కు అయినా రిప్లై ఇవ్వాలంటే మెసేజ్ పై హోల్డ్ చేసి పట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై అలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మెసేజ్ పై సింపుల్ గా స్వైప్ చేస్తే చాలు.. సులభంగా మెసేజులకు రిప్లై ఇవ్చొచు. అయితే ఈ రెండు కొత్త ఫీచర్లు ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చాయి.

More Telugu News