v i anad: వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ .. త్వరలో ఫస్టులుక్

  • శ్రీను వైట్లతో రవితేజ మూవీ 
  • తదుపరి సినిమా వీఐ ఆనంద్ తో 
  • డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్

ప్రస్తుతం రవితేజ .. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రవితేజతో ఓ సినిమా చేయడానికి దర్శకుడు వీఐ ఆనంద్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా ఆయనకి మంచి పేరుంది.

డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు లుక్ కాన్సెప్ట్ పోస్టర్ ను దీపావళికి రిలీజ్ చేయనున్నారు. ఆ దిశగానే చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. అందులో ఒక కథానాయికగా నాభా నటేశ్ ను తీసుకున్నారు. రవి తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమా, తన కెరియర్లో తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని రవితేజ భావిస్తున్నాడు.   

More Telugu News