Vaishnav Tej: మెగా హీరో తెరంగేట్రానికి సంబంధించిన అప్‌డేట్!

  • హీరోగా పరిచయం కాబోతున్న వైష్ణవ్ తేజ్
  • దర్శకత్వం వహించనున్న బుచ్చిబాబు సాన
  • స్వరాలు సమకూర్చనున్న దేవిశ్రీ ప్రసాద్

  మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలొచ్చాయి. కానీ, ఆ తర్వాత ఈ కొత్త మెగా హీరో నటించబోయే చిత్రానికి సంబంధించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ క్రమంలో సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ హీరోగా నటించనున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

More Telugu News