Gujarat: బ్రాహ్మణ కులమని అబద్ధం చెప్పి యువతిని పెళ్లాడిన యువకుడు.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు!

  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
  • అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్న యువకుడు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

100 అబద్ధాలు చెప్పయినా ఓ పెళ్లి చేయాలంటారు పెద్దలు. కానీ కొన్నికొన్ని సార్లు అలాంటి ప్రయత్నాలు తీవ్రంగా బెడిసికొడతాయి. తాజాగా అలాంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది. తాను బ్రాహ్మణుడనని ఓ యువతిని ప్రేమలోకి దించిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. కానీ వివాహమయ్యాక అసలు విషయం బయటపడటంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న అడివాడా గ్రామానికి చెందిన ఏక్తా పటేల్ ఇక్కడి మెహసానా ప్రాంతంలో అకౌంటెంట్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పనిచేస్తున్న సంస్థ యజమాని కుమారుడు యష్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తమది కూడా బ్రాహ్మణ కులమేనని చెప్పడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ ఈ నెల 23న వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన తర్వాత యష్ కుటుంబం బ్రాహ్మణులు కాదని తెలుసుకున్న ఏక్తా విస్తుపోయింది.  తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News