ys jagan: 'వైఎస్ జగన్ పై దాడి' ఘటనపై స్పందించిన శ్రీరెడ్డి.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

  • ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్
  • ప్రతిపక్షాలు దాడులు చేయించాయన్న శ్రీరెడ్డి
  • ఫన్నీ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఈ రోజు హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జగన్ కు ఐదు రోజుల పాటు విశ్రాంతి అవసరమని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు. కాగా, వైజాగ్ విమానాశ్రయంలో నిన్న జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నేతలు, సెలబ్రిటీలు జగన్ ను పరామర్శించారు.

కాగా, వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా జగన్ పై దాడిని ఖండించింది. కానీ ఆమె చేసిన ట్వీట్ కాస్తా రివర్స్ కావడంతో నెటిజన్లు శ్రీరెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్ పై నిన్న జరిగిన దాడిపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘మా జగన్ అన్నకు ఏం అయింది. రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ప్రతిపక్షాలు దాడులు చేయడం ఏంటి? దమ్ముంటే జగన్ ను ధైర్యంగా ఎదుర్కొనాలి. అంతేకానీ జనం కోసం పోరాడుతున్న జగన్ పై ఇలాంటి దాడులు చేయడం తప్పు. జగనన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేసింది.

ఇది చూసిన నెటిజన్లు.. జగన్ ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేతగానే ఉన్నారనీ, ఆ మాత్రం కూడా తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ‘జగన్ ఏపీలో ప్రతిపక్షమే, టీడీపీ వాళ్లు డబ్బులిచ్చి ప్రతిపక్షాలు అని చెప్పమన్నారా? బుర్ర తక్కువదానా’ అంటూ మండిపడుతున్నారు. అధికార, ప్రతిపక్షాలు ఎవరో కూడా తెలియని స్థితిలో శ్రీరెడ్డి ఉందనీ, ఆమెను అలా వదిలేయాలని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

More Telugu News