vijay: భారీస్థాయిలో తమిళనాట 'సర్కార్' బెనిఫిట్ షోలు

  • దీపావళికి రానున్న 'సర్కార్'
  • చెన్నైలోనే 100 బెనిఫిట్ షోలు 
  • హ్యాట్రిక్ హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్

తమిళనాట మాస్ హీరోగా విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా వస్తుందంటేనే అక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటిది ఈ సారి పండుగకే ఆయన 'సర్కార్' వస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన భారీస్థాయిలో 'సర్కార్' సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా తమిళనాడులో విడుదలకి ముందురోజు రాత్రి బెనిఫిట్ షోలు కూడా భారీగా వేస్తున్నారు.

ఒక్క చెన్నైలోనే 100 బెనిఫిట్ షోలు వేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో మరో 100 బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఈ సినిమాకి హిట్ టాక్ రావడమంటూ జరిగితే, వసూళ్ల పరంగా తమిళనాడులో 'బాహుబలి 2' రికార్డును అధిగమించడం ఖాయమనేది ట్రేడ్ విశ్లేషకుల మాట. గతంలో మురుగదాస్ - విజయ్ కాంబినేషన్లో 'కత్తి' .. 'తుపాకి' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News