eluru court: ఏలూరు కోర్టుకు వాస్తు దోషం.. ప్రధాన గేటు మూసివేత

  • ఏలూరు కోర్టులో కొన్ని రోజుల క్రితం కొత్త ద్వారం ఏర్పాటు
  • ఆ తర్వాత హఠాత్తుగా చనిపోయిన కొందరు న్యాయవాదులు
  • గేటును మూసివేయాలంటూ వాస్తు నిపుణుల సూచన

వాస్తు దోషం ఉందని పలువురు వాస్తు పండితులు చెప్పడంలో... ఏలూరు కోర్టు ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. వివరాల్లోకి వెళ్లే, కోర్టుకు ముందు, వెనక రెండు వైపులా పాత గేట్లు ఉండేవి. కొంత కాలం క్రితం కోర్టుకు మధ్య భాగాన కొత్తగా ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. ఈ గేటును ఏర్పాటు చేసినప్పటి నుంచి కొందరు లాయర్లు హఠాత్తుగా మరణించారు. దీంతో, కోర్టు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

కోర్టుకు వచ్చిన పలువురు వాస్తు పండితులు... కోర్టులో ఏర్పాటు చేసిన కొత్త ద్వారం వల్ల వాస్తు దోషం ఏర్పడిందని, దీంతో ఆ ద్వారాన్ని మూసివేయాలని సూచించారు. ఇదే విషయాన్ని బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గేటును మూసివేయాలంటూ ప్రధాన న్యాయమూర్తిని బార్ అసోసియేషన్ కోరింది. దీంతో, గేటు మూసి వేసి... అక్కడ ఓ ఫ్లెక్సీ పెట్టారు. 'ఈ గేటు మూయబడినది. పాత గేటు నుంచి మరియు వెనక గేటు నుంచి రావలెను' అంటూ ఫ్లెక్సీపై రాశారు.

More Telugu News