Chandrababu: పాలనలో వేలు పెడతారా? డీజీపీకి ఫోన్ చేయడం ఏంటి?: గవర్నర్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!

  • వివరాలు కావాలంటే నన్ను అడగొచ్చుగా
  • మీ పాత్ర ఏమిటి? మీరు ఏం చేస్తున్నారు?
  • కలకలం రేపిన గవర్నర్ పై చంద్రబాబు విమర్శలు

విపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి జరిగిన తరువాత, గవర్నర్ నరసింహన్, స్వయంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు ఫోన్ చేసి, వివరాలు అడగటంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ పై తాను తొలిసారిగా స్పందిస్తున్నానని చెబుతూ, పాలనలో వేలు పెట్టే అధికారం ఆయనకు లేదని అన్నారు. ఏమైనా వివరాలు కావాల్సి వస్తే, తనకు ఫోన్ చేయాలిగానీ, నేరుగా డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. అసలు గవర్నర్ పాత్ర ఏమిటని, నరసింహన్ చేస్తున్నది ఏంటని నిప్పులు చెరిగారు. గతంలోనే తాను గవర్నర్ల పాత్రపై పోరాడానని, మరెవరి తరఫునో ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తే సహించబోనని అన్నారు. ఢిల్లీ స్క్రిప్టును రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తే కుదరదని అన్నారు. గవర్నర్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

More Telugu News