Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఎన్టీఆర్'కి కోటి తీసుకున్న రకుల్?
  • రవితేజ సినిమా టీజర్ వస్తోంది 
  • 'అదుగో' రిలీజ్ డేట్ ఖరారు    

*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో శ్రీదేవి పాత్రను నేటి అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్న సంగతి విదితమే. ఇరవై నిమిషాల పాటు కనిపించే ఈ పాత్ర పోషణకు గాను రకుల్ కోటి రూపాయలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
*  రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం టీజర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నారు. రవితేజ మూడు పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చేస్తారు.
*  నటుడు, దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో రూపొందిన 'అదుగో' చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అవుతోంది. నవంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక పందిపిల్ల ప్రధాన పాత్రలో దీనిని రూపొందించారు.

More Telugu News