Chandrababu: దాడి ఎయిర్‌పోర్ట్ లోపల జరిగితే బాధ్యత ఎవరిది?: చంద్రబాబు

  • దాడిని ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • ఎయిర్‌‌పోర్ట్ వెలుపల జరిగితే బాధ్యత వహిస్తాం
  • కుట్రలను ఎదుర్కొంటూనే పనిచేయాల్సి వస్తోంది

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై దాడి పట్ల ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ కుట్రంటూ విరుచుకుపడుతున్నారు. దీనిపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. జగన్‌పై దాడిని ఖండిస్తున్నామన్న చంద్రబాబు.. ఈ దాడిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దాడి ఘటన ఎయిర్‌పోర్ట్ లోపల జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్ వెలుపల జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని.. దాడి లోపల జరిగింది కాబట్టి కేంద్ర పరిధిలోకి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పనిచేయనివ్వడం లేదన్న ఆయన, కేంద్రం కుట్రలను ఎదుర్కొంటూనే పనిచేయాల్సి వస్తుందన్నారు. దాడి జరిగిన విధానం తెలుసుకోవడం దర్యాప్తులో భాగం కాదా? అని ప్రశ్నించారు.  

More Telugu News