assam: నిషేధిత ఉల్ఫాలో చేరిన అస్సాం విద్యార్థి నాయకుడు

  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • పౌరసత్వ నమోదు ప్రక్రియ ఆధునికీకరించడంతో నిర్ణయం
  • కనిపించడం లేదంటూ గత నెలలో తల్లిదండ్రుల ఫిర్యాదు

అస్సాంకు చెందిన పంకజ్ ప్రేమ్ దత్ అనే ఓ విద్యార్థి నాయకుడు నిషేధిత ఉల్ఫా (యూనైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం)లో చేరాడు. వలసలకు వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. ఉల్ఫాలో చేరిన ప్రేమ్ దత్.. కక్ష సాధించుకుంటానని ఆవేశపూరితంగా ప్రమాణం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వలస వ్యతిరేక ఉద్యమాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అస్సాం ప్రభుత్వానికి ఈ పరిణామం మరింత ఆందోళన కలిగించనుంది.

ఇదిలావుండగా, అస్సాంలోని ‘ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్’ డెర్గావ్ ప్రాంతీయ కమిటీకి ప్రేమ్ దత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. బంగ్లాదేశీ హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పించాలని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదించిన ‘పౌరసత్వ సవరణ బిల్లు-2016’ను ప్రేమ్ దత్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తిరుగుబాటు చేయాలని అప్పట్లోనే నిర్ణయించుకున్నాడు.

పరేష్ బారువా నాయకత్వం వహిస్తున్న ఉల్ఫా-ఐలో ప్రేమ్ దత్ చేరాడు. అస్సాం ప్రభుత్వం వివాదాస్పద జాతీయ పౌరుల నమోదు ప్రక్రియను ఆధునికీకరించిన నేపథ్యంలో ప్రేమ్ దత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదిలావుండగా ప్రేమ్ దత్ అక్టోబర్ 5 నుంచి కనిపించడం లేదని అతడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. 

More Telugu News