Rahul Gandhi: ప్రధాని విషయాన్ని దాచిపెట్టగలరు కానీ తప్పించుకోలేరు: రాహుల్ గాంధీ

  • సీబీఐ డైరెక్టర్ తొలగింపుపై స్పందించిన కాంగ్రెస్ చీఫ్
  • ‘రాఫెల్’పై విచారణ చేపట్టినందుకే తొలగించారు
  • సాక్ష్యాలను నాశనం చేసేందుకే ఈ చర్య 

సీబీఐలో జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఘాటుగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా సీబీఐ డైరెక్టర్ ను ఎందుకు తొలగించారని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణంలో విచారణ చేపట్టినందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తప్పించారని విమర్శించారు.

అర్ధరాత్రి అధికారులను తొలగించడం దారుణమని వ్యాఖ్యానించారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు సీబీఐ డైరెక్టర్ ను తొలగించారని, సీబీఐ డైరెక్టర్ ను నియమించాలన్నా, తొలగించాలన్నా త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ త్రిసభ్య కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ ఉండాలన్నారు. ప్రధాని మోదీ విషయాన్ని దాచిపెట్టవచ్చు కానీ తప్పించుకోలేరని హెచ్చరించారు.

More Telugu News