vijay: 'సర్కార్' అదే రోజున వచ్చేస్తున్నాడు

  • విజయ్ హీరోగా రూపొందిన 'సర్కార్'
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 
  • నవంబర్ 6వ తేదీన విడుదల      

సంక్రాంతి బరిలో తమ సినిమాను నిలపడానికి తెలుగు హీరోలు ఎలా ఆసక్తిని చూపుతారో, దీపావళికి తమ సినిమాను రంగంలోకి దింపాలని తమిళ హీరోలు అలా పోటీపడుతుంటారు. అలా ఈ సారి దీపావళికి ప్లాన్ చేసుకుని మరీ విజయ్ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సర్కార్' చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు అలముకున్నాయి. దాంతో ఈ సినిమా ముందుగా చెప్పిన సమయానికి వస్తుందా? లేదా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. కానీ తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకి అడ్డంకులు తొలగిపోవడంతో, ముందుగా చెప్పినట్టుగానే తెలుగు ..  తమిళ భాషల్లో దీపావళికి వచ్చేస్తోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో కనిపించనుంది.   

More Telugu News