jagan: ఆపరేషన్ గరుడలో భాగమే.. గవర్నర్, కేసీఆర్, కేటీఆర్, కేంద్ర మంత్రి, జీవీఎల్ అందరూ క్షణాల్లో స్పందించారు.. పెద్ద కుట్ర ఉంది!: ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • ఆపరేషన్ గరుడ ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది
  • రాష్ట్రంలో అస్థిరతను సృష్టించేందుకు యత్నిస్తున్నారు
  • వెనక ఉన్న కుట్రలను వెలికి తీస్తాం

వైసీపీ అధినేత జగన్ పై కత్తితో దాడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తుంటే...  రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ఏదో బలమైన కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తోందని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. జగన్ పై దాడి జరిగిందనే వార్త తెలియగానే తామంతా చాలా బాధ పడ్డామని ఆయన చెప్పారు.

అయితే, తనకు ఏమీ కానట్టు ఆయన హైదరాబాదుకు వెళ్లిపోయారని అన్నారు. ఈ ఘటన జరిగి గంట కూడా కాకముందే... ఢిల్లీలో ఉన్న గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి ఫోన్ చేయడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఏపీలో ఏం జరిగినా స్పందించని కేసీఆర్, కేటీఆర్ లు ఘటనపై వెంటనే స్పందించారని తెలిపారు. కేంద్ర మంత్రి కూడా వెంటనే స్పందించారని, బీజేపీ నేత జీవీఎల్ కూడా వెంటనే లైన్ లోకి వచ్చి, విషయాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని మండిపడ్డారు.

ఇదంతా చూస్తుంటే ఆపరేషన్ గరుడ ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయని కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రంలో అలజడులను పెంచి, అస్థిరతను తీసుకురావడానికి కొందరు యత్నిస్తున్నారని చెప్పారు. తాము అన్నీ గమనిస్తున్నామని... దీని వెనుక ఏవైనా కుట్రలుంటే వెలికి తీస్తామని హెచ్చరించారు. 

More Telugu News