trivikram: కల్యాణ్ రామ్ నిర్మాతగా త్రివిక్రమ్ మూవీ

  • అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ 
  • తదుపరి సినిమా వెంకటేశ్ తో
  • ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఓ ప్రాజెక్టు

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత' విడుదలైన ప్రతి చోటున విజయవిహారం చేస్తోంది. ఈ సినిమా సాధించిన విజయం పట్ల నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత ఆయన వెంకటేశ్ కథానాయకుడిగా ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు చెబుతున్నారు.

ఈ సినిమా తరువాతనే ఆయన కల్యాణ్ రామ్ నిర్మాణంలో ఒక ప్రాజెక్టు చేయనున్నాడనేది తాజా సమాచారం. 'అరవింద' సమయంలో ఎన్టీఆర్ .. కల్యాణ్ రామ్ తో త్రివిక్రమ్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సమయంలోనే కల్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేలా మాటలు జరిగాయట. ఈ సినిమాలో ఎన్టీఆర్ గానీ .. కల్యాణ్ రామ్ గాని హీరోలు కాదు ..  ఒక యువ హీరోతో ఈ ప్రాజెక్టు వుండనుందనేది సమాచారం.   

More Telugu News